Posts

Bandi Sai Bhagirath: ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై బండి సంజయ్ కొడుకు దాడి.. వైరల్

 Bandi Sai Bhagirath: ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై బండి సంజయ్ కొడుకు దాడి.. వైరల్ అవుతున్న వీడియో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమారుడు (Bandi Sanjay) బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhagirath) వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమారుడు (Bandi Sanjay) బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhagirath) వివాదంలో చిక్కుకున్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసి చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ తోటి విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిడుతూ చావబాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పక్కనే ఉన్న భగీరథ్ స్నేహితుడు కూడా విచక్షణ రహితంగా బాధితుడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ భగీరథ్ హెచ్చరించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని మంత్రికి చెప్పినా ఎవరూ తనను ఏమీ చేయలేరంటూ భగీరథ్ రంకెలేశారు. భగీరథ్ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీలో చదువుకుంటున్న సమయంలోనూ ఆయన ఇలానే ప్రవర్తించినట్టు తెలు

KCR vision 2023 elections

 శాసనసభ ఎన్నికలే లక్ష్యం Jun 23 2021 ఇప్పట్నుంచే కేసీఆర్‌ వ్యూహాత్మక అడుగులు ‘ఏపీ ప్రాజెక్టులపై తాడోపేడో’ ప్రకటనా అందుకే? మళ్లీ సెంటిమెంట్‌ను రగిలించే ఎత్తుగడ బీజేపీ, కాంగ్రెస్‌, షర్మిల పార్టీకి చెక్‌ పెట్టే యోచన టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో రాష్ట్రంలో బీజేపీ మంచి జోష్‌లో ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికార పీఠం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరస ఓటములు ఎదురవుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం 2023 ఎన్నికల్లో అధికారం తమదే అంటున్నారు! దొర పాలనకు చరమగీతం పాడతామని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని వైఎస్‌ షర్మిల చెబుతున్నారు. కొత్త పార్టీ పెడుతున్న ఆమె.. ఇప్పటికే వేగంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, షర్మిల పార్టీ.. అందరి లక్ష్యం అధికారమే! వీరికి చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ రెండున్నరేళ్ల ముందే రంగంలోకి దిగారు! రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు! హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగు

సంక్షోభంలో వైద్య రంగం

సంక్షోభంలో వైద్య రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న ఆస్పత్రులు విధి నిర్వహణకు వైద్య సిబ్బంది నిరాసక్తత..! మృతశిశువును కడుపులో మోస్తూ ఆయాసపడుతున్న ఓ గర్భిణి.. కరోనా అనుమానం కారణంగా వైద్యం అందక 12 గంటలపాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయింది!! హన్మకొండలో జరిగిన దారుణమిది!! ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేసిన్రు. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. డాడీ బై.. డాడీ బై, అందరికీ బై డాడీ’ ..అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న కొన్ని క్షణాలకే ప్రాణాలు కోల్పోయిన రవికుమార్‌ హృదయవిదారక స్థితి ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది!! జ్వరం, దగ్గుతో బాధపడుతూ.. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మహిళను చికిత్స కోసం తీసుకెళ్తే.. ‘కరోనా లక్షణాలున్నాయి, చికిత్స చేయం’ అంటూ పది ఆస్పత్రులు తిప్పి పంపేశాయి! చివరికి గాంధీ ఆస్పత్రి ముందే నురగలు కక్కుతూ చనిపోయిందామె!! పదిరోజుల క్రితం జరిగిన విషాదమిది!! (హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి) కరోనా దెబ్బకు రాష్ట్రంలో వైద్య రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేసులు నానాటికీ శరవేగంగా పెరిగిపోతుండడంతో కార్పొరేట్‌, ప్రైవేట్‌, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌ల

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కవిత.. బీజేపీపై ఎటాక్ చేసేందుకేనా?

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కవిత.. బీజేపీపై ఎటాక్ చేసేందుకేనా? Powered By PLAYSTREAM కొన్నాళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న మాజీ ఎంపీ కవిత.. మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారా? బొగ్గు గనుల ప్రయివేటీకరణపై వ్యతిరేక పోరుతో బీజేపీపై ఎటాక్ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారా? నాయకత్వ వైఫల్యంతో బలహీనపడ్డ టీఆర్ఎస్ అనుబంధ సంఘానికి కవిత ఏ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారు? గతంలో వదిలేసిన సింగరేణి కార్మిక సంఘం బాధ్యతలను ఆమె తిరిగి స్వీకరించడంలో పరమార్థమేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.     తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ కవిత తిరిగి క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో కాస్త సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గతంలో తను నాయకత్వం వహించిన టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం బాధ్యతలను కవిత మళ్లీ స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  బొగ్గు బ్లాక్ ల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమం ద్వారా కవిత రీఎంట్రీ ఇస్తున్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగరేణివ్యాప్తంగా కేంద్ర ప్ర

విద్యుత్తు బిల్లులపై అపోహలు అక్కర్లేదు

విద్యుత్తు బిల్లులపై అపోహలు అక్కర్లేదు అనుమానాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌లు: మంత్రి 30, 40, 30 శాతాల్లో చెల్లించే వీలు ఒక్క  యూనిట్‌ కూడా ఎక్కువ వేయలేదు హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు బిల్లులపై అపోహలు, అనుమానాలు అక్కర్లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏ   తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఇస్తున్నామని, అనుమానాల నివృత్తికి ప్రతి ఈఆర్‌వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం)లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగం పెరిగే కొద్దీ కేటగిరి మారిందన్నారు. సాధారణ రోజుల కన్నా వేసవి వినియోగం 30-40ు దాకా ఎక్కువ ఉంటుందని, లాక్‌డౌన్‌తో 15-20ు అదనపు వినియోగ ం నమోదైందని తెలిపారు. సోమవారం ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బిల్లులను 30, 40, 30% చొప్పున వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నామని చెప్పారు. రెగ్యులర్‌ బిల్లులతో పాటు బకాయిలు కట్టాలన్నారు. అపరాధ రుసుం   చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సరాసరి బిల్లుల వల్ల కొందరికి ప్రయోజనం, మరికొందరికి